మస్కట్ నుంచి శంషాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు

- July 08, 2020 , by Maagulf
మస్కట్ నుంచి శంషాబాద్ చేరుకున్న ఛార్టర్డ్ ఫ్లైటు

మస్కట్:మస్కట్ లో చిక్కుకున్న భారతీయుల కోసం టీఆర్ఎస్ ఎన్నారై ఒమన్ శాఖ, డెక్కన్ వింగ్ (ఇండియన్ సోషల్ క్లబ్) సంయుక్తంగా మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. జులై 1న ఈ విమానం హైదరాబాద్‌కు వెళ్లాల్సి ఉన్నా.. కొన్ని సాంకేతిక కారణాల వల్ల తెలంగాణ ప్రభుత్వం నుంచి తగిన అనుమతులు సమయానికి రాలేదు. దీంతో ఈ విమానం మస్కట్ నుంచి తెలంగాణకు వెళ్లలేకపోయింది. ఈ కారణంగా విమానంలో స్వదేశానికి వెళ్లాలనుకున్న భారతీయులు నిరాశ చెందారు. అయితే ఇదే సమయంలో నిర్వాహకులు తెలంగాణ ప్రభుత్వాన్ని, టీఆర్ఎస్ ఎన్నారై కో-ఆర్డినేటర్ మహేష్ బిగాలను, ఎంపీ అస్సదుద్దీన్ ఒవైసిని సంప్రదించారు. విషయం తెలుసుకున్న మహేష్ బిగాల తక్షణమే స్పందించి సీఎం క్యాంప్ ఆఫీస్ వాళ్లతో, ప్రభుత్వ ఉన్నతాధికారులతో మాట్లాడి వెంటనే అనుమతులు తీసుకున్నారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం ‘నో అబ్జెక్షన్‌’ లేఖను విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి అనుమతులు రావడంతో మంగళవారం మస్కట్ నుంచి హైదరాబాద్‌కు ఈ విమానం వెళ్ళింది.

ఈ విషయంలో వెంటనే స్పందించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కి, మంత్రి కేటీఆర్‌కి, మహేష్ బిగాలకు,అస్సదుద్దీన్ ఒవైసికి తమకు సహకరించిన ప్రభుత్వ ఆధికారులకు నిర్వాహకులు మరియు ప్రయాణికులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు టీఆరెస్ ఎన్నారై సెల్ ఒమాన్ శాఖ అధ్యక్షుడు ఈగపూరి మహిపల్ రెడ్డి మీడియా కి తెలియచేశారు.
ఆపదలో ఉన్న వారికి ఈ విదంగా ఫ్లైట్ ఏర్పాట్లు చేసేందుకు ప్రత్యేక కృషి చేసిన ఇండియన్ సోషల్ క్లబ్ వారికి, నిర్వహుకులు సోహైల్ ఖాన్ కి,యూనిస్,షేక్ అహ్మద్,ఇస్మాయిల్ భేగ్, అబ్దుల్ కైసర్,ముస్తఫా,అబ్దుల్ గఫ్ఫార్,షఫీ అజీమ్,ఫాసియుద్దీన్, రాజేందర్ రెడ్డి మరియు ఇతర నిర్వాహక సభ్యులను మహిపల్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు.

--లెనిన్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఒమన్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com