ఫేక్‌ సర్టిఫికేషన్‌: వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష

- July 09, 2020 , by Maagulf
ఫేక్‌ సర్టిఫికేషన్‌: వ్యక్తికి మూడేళ్ళ జైలు శిక్ష

మనామా:ఓ వ్యక్తి ఫేక్‌ సర్టిఫికెట్లను ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీకి అటెస్టేషన్‌ కోసం సమర్పించిన కేసులో నిందితుడికి మూడేళ్ళ జైలు శిక్ష విధించింది హై క్రిమినల్‌ కోర్ట్‌. ఈ విషయాన్ని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ సదరన్‌ గవర్నరేట్‌ చీఫ్‌ ప్రాసిక్యూటర్‌ షేక్‌ అబ్దుల్లా బిన్‌ అబ్దుల్‌రహ్మాన్‌ అల్‌ ఖలీఫా వెల్లడించారు. ఎడ్యుకేషన్‌ మినిస్ట్రీ నుంచి అందిన నోటిఫికేషన్‌ నేపథ్యంలో నిందితుడిపై చర్యలు తీసుకోవడం జరిగింది. ఓ అరబ్‌ దేశానికి చెందినదిగా పేర్కొంటూ ఓ సర్టిఫికెట్‌ని సమర్పించగా, మరో సర్టిఫికెట్‌ని ఇంకో దేశానికి చెందినదిగా పేర్కొన్నారు. విచారణ సందర్భంగా నిందితుడు రెండు సర్టిఫికెట్లను ఫోర్జరీ చేసినట్లు గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com