తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు బ్రేక్
- July 10, 2020
హైదరాబాద్:తెలంగాణ సెక్రటేరియట్ కూల్చివేతకు హైకోర్టు బ్రేక్ వేసింది. పాత సెక్రటేరియట్ స్థానంలో కొత్త సెక్రటేరియట్ కట్టడం కోసం పాత భననాలను ప్రభుత్వం గత మూడు రోజులుగా కూల్చివేస్తుంది. ప్రస్తుతం కోవిడ్ నిబంధనలు ఉల్లంగిస్తూ పాత సెక్రటేరియట్ ను కూల్చివేస్తున్నారంటూ ప్రొఫెసర్ పి ఎల్ విశ్వేశర్ రావ్ హైకోర్టులో పిల్ దాఖలు చేశాడు. భవనాల కూల్చివేయడం వలన వాతావరణ కాలుష్యం అవుతుందని పిటీషనర్ తన పిల్ లో తెలిపాడు. మున్సిపాలిటీ సాలీడ్ వేస్ట్ మేనేజిమెంట్ నిబంధనలను పట్టించుకోకుండా సచివాలయం కూల్చివేత చేపడుతున్నారని అభ్యంతరం తెలిపాడు. ఆ పిల్ స్వీకరించిన హైకోర్టు.. సెక్రటేరియట్ కూల్చివేత పనులను సోమవారం వరకు నిలిపివేయాలని ఆదేశించింది. దాంతో సచివాలయ కూల్చివేత పనులకు తాత్కాలికంగా బ్రేక్ పడింది.
తాజా వార్తలు
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు పై మోహన్‌లాల్ స్పందన