కొత్త ఎమర్జన్సీ మెడికల్‌ సెంటర్‌ ప్రారంభం

- July 10, 2020 , by Maagulf
కొత్త ఎమర్జన్సీ మెడికల్‌ సెంటర్‌ ప్రారంభం

దోహా:హమాద్‌ మెడికల్  కార్పొరేషన్‌ (హెచ్‌ఎంసి), ఇండస్ట్రియల్‌ ఏరియా శాటిలైట్‌ ఎమర్జన్సీ డిపార్ట్‌మెంట్‌ (ఐఎఎస్‌ఇడి)ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఖతార్‌లో అర్జంట్‌ కేర్‌కి సంబంధించి ఇది చాలా ప్రాముఖ్యమైన అంశమని డిపార్ట్‌మెంట్‌ వెల్లడించింది. తక్కువ తీవ్రత కలిగిన మెడికల్‌ కేసుల్ని ఈ సెంటర్‌ డీల్‌ చేస్తుంది. ఇండస్ట్రియల్‌ ఏరియాలోనూ, సమీప ప్రాంతాల్లో వున్నవారికి ఈ సెంటర్‌ ఉపయోగకరంగా వుంటుంది. హెచ్‌సి సిస్టమ్ వైడ్‌ ఇన్సిడెంట్‌ కమాండ్‌ సెంటర్‌ కమిటీ ఛెయిర్‌ డాక్టర్‌ సాద్‌ అల్‌ కాబి ఈ కేంద్రాన్ని సందర్శించారు. ఇలాంటిదే ఇంకో కేంద్రాన్ని రస్‌ లఫ్ఫాన్‌లో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు చెప్పారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com