బహ్రెయిన్‌లో త్వరలో డ్రైవ్ ఇన్ సినిమా
- July 11, 2020
మనామా:ముక్తా సినిమాస్ త్వరలో బహ్రెయిన్‌లో తొలి డ్రైవ్ ఇన్ సినిమాని ప్రారంభించనుంది. జులై 20న దీన్ని ప్రారంభిస్తారు. ముక్తా సినిమా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అక్షయ్ బజాజజ్ ఈ విషయాన్ని వెల్లడించారు. పికో ఎగ్జిబిషన్స్ సహకారంతో బహ్రెయిన్ బే వద్ద దీన్ని ఏర్పాటు చేశారు. సింగిల్ స్క్రీన్‌తో ఏర్పాటైన ఈ డ్రైవ్ ఇన్ సినిమా 100 కార్లను అకామడేట్ చేయగలదు. ఎఫ్‌ఎం ఫ్రీక్వెన్సీ ద్వారా మూవీ సౌండ్‌ని బ్రాడ్‌కాస్ట్ చేస్తారు. ఒకవేళ కారు ఇంజిన్‌ని ఉపయోగించకపోతే, కారు బ్యాటరీ డ్రెయిన్ అయిపోయే అవకాశం వుంటుంది. కాబట్టి, బ్యాటరీ పవర్డ్ పోర్టబుల్ రేడియో లేదా బూమ్ బాక్స్‌ని వెంట తీసుకెళ్ళడం మంచిది. సినిమా ది¸యేటర్ల మూసివేత నేపథ్యంలో ఈ డ్రైవ్ ఇన్ సినిమా కాన్సెప్ట్ ప్రాచుర్యంలోకి వచ్చింది.
తాజా వార్తలు
- కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి చాను చరిత్ర.. భారత్‌కు తొలి స్వర్ణం, రికార్డుల మోత
- ఎతిహాద్ రైల్ విస్తరణకు షెడ్యూల్ ఖరారు..
- కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ఘనంగా ‘Gift A Smile’ సేవా కార్యక్రమం
- 27వ కార్గిల్ విజయ్ దివస్.. 'ఆపరేషన్ విజయ్' వీరులకు దేశం ఘన నివాళి
- రెడ్ సిలో హౌతీ దాడులను తీవ్రంగా ఖండించిన కువైట్
- జంతర్ మంతర్ ఉద్యమం ప్రజాస్వామ్య విజయానికి నిదర్శనం: పరకాల ప్రభాకర్
- నేపాల్ వెళ్లే భారతీయులకు బిగ్ రిలీఫ్..ఇండియన్ కరెన్సీపై కీలక నిర్ణయం!
- తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం
- అబుదాబిలో ఉద్యోగాల భర్తీకి TOMCOM నోటిఫికేషన్..
- ఏపీలో అందుబాటులోకి సరికొత్త రవాణా యాప్







