కరోనా కేసుల్లో రికార్డ్ కొడుతున్న భారత్
- July 12, 2020
దేశంలో కరోనా వైరస్ సామూహిక వ్యాప్తి లేదని కేంద్రం, వైద్య వర్గాలు గట్టిగా చెబుతున్నప్పటికీ.. కొత్త కేసులు భారీగా బయటపడుతుండటం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన లెక్కల ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 28,637 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇది మరో రికార్డు. ఆదివారం నాటి కేసులతో కలిపి, భారత్ లో మొత్తం కేసుల సంఖ్య 8.5లక్షలకు పెరిగింది. కరోనాకు మోస్ట్ ఎఫెక్ట్ అయిన దేశాల జాబితాలో మనం అమెరికా(33.55లక్షల కేసులు), బ్రెజిల్(18లక్షల కేసులు) తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నాం.
కేంద్ర ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం దాకా కరోనా కాటుకు గురై 551 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 22,674కు పెరిగింది. కాగా, భారత్ లో కొత్త కేసులతోపాటు రికవరీ రేటు గణనీయంగా ఉండం ఊరటకలిగిస్తున్నది. ఇప్పటిదాకా 62.78 శాతం రికవరీ రేటుతో 5.34లక్షల మంది కొవిడ్ వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 3లక్షలకు దగ్గరగా ఉంది. మోస్ట్ ఎఫెక్టెడ్ రాష్ట్రంగా ఉన్న మహారాష్ట్రలో కొవిడ్ మరణాల సంఖ్య 10వేల మార్కు దాటడం విషాదకరం. అక్కడ మొత్తం 2.46లక్షల కేసులు నమోదుకాగా, ఇప్పివరకు 10,116 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







