కువైట్:లిబరేషన్ టవర్ లో ఇవాళ్టి నుంచి విదేశీ వ్యవహారాల శాఖ సేవలు ప్రారంభం
- July 12, 2020
కువైట్ సిటీ:కరోనా ప్రభావంతో కొన్నాళ్లుగా సేవలను నిలిపివేసిన కువైట్ విదేశీ వ్యవహారాల శాఖ..ఎట్టకేలకు ప్రత్యక్ష సేవలను పునరుద్ధరించింది. సభన్ లోని లిబరేషన్ టవర్, సిటిజన్ సర్వీస్ లోని విదేశీ వ్యవహారాల కేంద్రాలు ఆదివారం నుంచి తమ కార్యకలాపాలను యధావిధిగా నిర్వహించబోతున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ఆయా కేంద్రాల్లో ఎలాంటి సేవలను పొందటానికైనా ముందస్తుగా ఫారెన్ అఫైర్స్ వెబ్ సైట్ లో అపాయింట్మెంట్ స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అపాయింట్మెంట్ ఖరారు అయిన వారినే ఆఫీసులోకి అనుమతిస్తారు. కరోనా వ్యాప్తి నియంత్రణలో భాగంగా ఆఫీసులలో రద్దీని తగ్గించేందుకు అపాయింట్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







