లేబర్‌ రైట్స్‌ ఉల్లంఘన: కొత్త జరీమానాలు

- July 13, 2020 , by Maagulf
లేబర్‌ రైట్స్‌ ఉల్లంఘన: కొత్త జరీమానాలు

రియాద్‌: కరోనా వైరస్‌ (కోవిడ్‌19) నేపథ్యంలో ప్రైవేట్‌ సెక్టార్‌లో సౌదీ వర్కర్స్‌కి మద్దతుగా రూపొందిన రాయల్‌ ఆర్డర్‌ని ఉల్లంఘించే కంపెనీలపై కొత్త జరీమానాలు విధించబడతాయి. జనరల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ సోషల్‌ ఇన్సూరెన్స్‌ (జీఓసిఐ) ఈ మేరకు  పలు పెనాల్టీస్‌కి ఆమోద ముద్ర వేసింది. పెనాల్టీస్‌ 10,000 సౌదీ రియాల్స్‌ నుంచి 50,000 సౌదీ రియాల్స్‌ వరకు వుంటాయి. ఎంతమంది హక్కుల ఉల్లంఘన జరిగింది అన్నదానికి అనుగుణంగా ఈ జరీమానాలు విధించే అవకాశం వుంటుందని అధికారులు పేర్కొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com