తెలంగాణ:కొత్తగా 1,550 కరోనా పాజిటివ్ కేసులు
- July 13, 2020
హైదరాబాద్:తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 1,550 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 36,221కు చేరింది. ఇవాళ ఒక్కరోజే 9 మంది కరోనాతో మృతిచెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అలాగే సోమవారం రోజున ఆస్పత్రుల నుంచి 1,197 మంది కోలుకోని డిశ్చార్జ్ కాగా.. ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 23,679కు చేరింది.
కరోనాతో ఇప్పటి వరకు మృతి చెందినవారి సంఖ్య 365కు చేరింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 12,178 మంది కరోనాతో వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సోమవారం 11,525 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా.. అందులో 9,975మందికి నెగెటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అత్యధికంగా GHMCలో 926, రంగారెడ్డిలో 212, మేడ్చల్లో 53కేసులు నమోదయ్యాయి.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)
తాజా వార్తలు
- సమాజం పై ఎన్టీఆర్ సానుకూల ప్రభావం చూపారు: వెంకయ్య నాయుడు
- ఎయిర్ ఇండియా ఫ్లైట్: ప్రయాణికుడు చేసిన పనికి హడలి పోయిన పైలట్..
- న్యూఢిల్లీలో IEC వార్షిక సమావేశంలో పాల్గొన్న ఖతార్..!!
- పాలస్తీనాను గుర్తించిన యూకే, కెనడా, ఆస్ట్రేలియా, పోర్చుగల్..!!
- యూఏఈలో ఆన్లైన్ ఫుడ్ డెలివరీలను నిషేధించిన స్కూల్స్..!!
- నివాస ప్రాంతాలలో బ్యాచిలర్ హౌసింగ్.. కఠిన చర్యలు..!!
- మసాజ్ పార్లర్ల ద్వారా మనీలాండరింగ్..!!
- స్వదేశానికి తిరిగి వచ్చిన సయ్యిద్ బిలారబ్..!!
- షేక్ హ్యాండ్ ఇద్దాం రండీ..టీమ్ఇండియా ఆటగాళ్లను కోరిన గంభీర్
- తెలంగాణ నుంచి మరో 2 వందేభారత్ రైళ్లు