కువైట్:ఫర్వానియాలో లాక్ డౌన్ పై యథాతధస్థితి

- July 14, 2020 , by Maagulf
కువైట్:ఫర్వానియాలో లాక్ డౌన్ పై యథాతధస్థితి

కువైట్ సిటీ:దేశంలో కరోనా మహమ్మారి తీవ్రత, వైరస్ వ్యాప్తి నివారణ చర్యలపై చర్చించేందుకు ప్రధాని ఆధ్వర్యంలో మంత్రిమండలి సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో వైరస్ ప్రభావంపై తాజా స్థితిగతులను, వైరస్ బారిన పడుతున్న సంఖ్య, వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి గణాంకాల వివరాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ మంత్రిమండలికి వివరించింది. అలాగే ఈద్ అల్ అధా రోజుల్లో వైరస్ ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా మంత్రిమండలి చర్చించింది. అయితే..లాక్ డౌన్ తర్వాత దశల వారిగా సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు చేపడుతున్న చర్యలపై ఈ వారపు భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. పాక్షిక కర్ఫ్యూలో మరికొన్ని సడలింపులు ఉంటాయని భావించినా..ఆ దిశగా మంత్రిమండలి ఎలాంటి ప్రకటన చేయలేదు. అలాగే ఫర్వానియాలో లాక్ డౌన్ సడలింపులపై కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. వచ్చే వారం సమావేశంలో ఈ అంశాలపై చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు ఫర్వానియాలో యథాతధ స్థితి కొనసాగనుంది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com