తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స...
- July 15, 2020
హైదరాబాద్:తెలంగాణలో రోజురోజూకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి.కరోనా వైరస్‌కు కేవలం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే చికిత్స అందించారు. కానీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడం.. కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలనుకునే వారి సంఖ్య పెరగడంతో ప్రైవేటు ఆస్పత్రులకు అనుమతిలిచ్చారు. దీంతో అధిక శాతం మంది ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటుకు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రైవేటు ఆస్పత్రుల్లో నిర్వహించే కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్సకు వేసే బిల్లుల పట్ల తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. దీనికితోడు పాజిటివ్ కేసులు పల్లెల్లోకి పాకిపోవడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే చికిత్స అందిస్తున్న ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ కరోనా నిర్ధారణ పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా నిర్ధారణ పరీక్షలు, చికిత్స ఉచితంగా అందించాలని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
అందుకోసం మొదటగా 3 ప్రైవేటు మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారు. మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమతా మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా పరీక్షలు, కరోనా చికిత్స ఉచితంగా అందించేందుకు ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించిన పూర్తి విధివిధానాలను ఇంకా ప్రకటించాల్సి ఉంది. అనంతరం ఈ ఉచిత సేవలను ప్రైవేటు మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉందని తెలుస్తోంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?