రక్త దానం చేసిన సైబరాబాద్ సీపీ సజ్జనార్

- July 15, 2020 , by Maagulf
రక్త దానం చేసిన  సైబరాబాద్ సీపీ సజ్జనార్

హైదరాబాద్:తలసీమియా వ్యాధితో బాధపడుతున్న, కేన్సర్‌, డయాలసిస్‌, యాక్సిడెంట్‌ అయిన వారు రక్తం లేకపోవడంతో ప్రాణాలు కోల్పోతున్నారని, దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేసి వారి ప్రాణాలు కాపాడాలని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పిలుపునిచ్చారు. సైబరాబాద్ పోలీసులు రక్తదానం చేసేందుకు ఎప్పుడూ ముందుంటారన్నారు. అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని తెలిపారు.

లాక్ డౌన్ వల్ల ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొని రక్త నిల్వలు పడిపోయాయి. దీంతో తలసమియా,క్యాన్సర్,మెడికల్ ఎమర్జెన్సీ ,బ్లడ్ క్యాన్సర్ రోగులు ఇబ్బందులు పడుతున్నారు. తీఒక్కరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. 
కొంతమందికి రక్తదానం చేయడం వల్ల బలహీనమవుతామనే అపోహ వుంది. రక్తదానంపై అపోహలు వద్దన్నారు. రక్తదానం చేస్తే మళ్లీ కొత్త రక్తం వస్తుందన్నారు. 
రక్తదానం చేయడం వల్ల ప్రమాదంలో గాయపడిన వారిని రక్షించి వారికి పునర్జన్మ ఇచ్చినట్లు అవుతుందని తెలిపారు. 

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com