ఖతార్:సెప్టెంబర్ 1 నుంచి స్కూల్స్ ప్రారంభం..
- July 17, 2020
దోహా:లాక్ డౌన్ తర్వాత తిరిగి సాధారణ జనజీవనం దిశగా అడుగులు వేస్తున్న ఖతార్ ప్రభుత్వం..ఇక స్కూళ్ల పున:ప్రారంభంపై ఫోకస్ చేసింది. దశల వారిగా అన్ లాక్ మార్గదర్శకాలను జారీ చేస్తున్న ప్రభుత్వం..2020-2021 విద్యాసంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. ఈ మేరకు సెప్టెంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లను ప్రారంభిస్తున్నట్లు విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే..ప్రభుత్వ, ప్రైవేట్ స్కూల్ ఉద్యోగులు మాత్రం వచ్చే నెల 19 నుంచే విధులకు హజరుకావాలని కూడా సూచించింది. అంతేకాదు...ఉద్యోగులు, విద్యార్ధులు అటెండెన్స్ విషయంలో ఎలాంటి మినహాయింపులు లేవని కూడా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే..కరోనా నేపథ్యంలో ఉద్యోగులు, విద్యార్ధుల ఆరోగ్య భద్రతకు అన్ని ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని కూడా ఆదేశించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?