తెలంగాణ అబ్బాయితో అమెరికా అమ్మాయి పెళ్ళి
- July 18, 2020
మన స్వదేశి అబ్బాయిలు విదేశీ అమ్మాయిలను వలచి వరించటం కొత్తేమీ కాకపోయినా ప్రస్తుత కరోనా క్రైసిస్ లో ఇలాంటి ఖండాంతర వివాహం జరగటాన్ని ప్రత్యేక విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఒక ఖండాంతర,మతాంతర,కులాంతర వివాహం భారత కాలమానం ప్రకారం ఈ రోజు సాయంత్రం 8 గంటల15 నిముషాలకు అమెరికాలోని సౌత్ కరోలినా లో జరగనుంది.
సూపర్ స్టార్ కృష్ణ- విజయనిర్మల కాంబినేషన్లో పి.సి. రెడ్డి దర్శత్వంలో " అన్నయ్య " అనే 500 ఏపిసొడ్స్ మెగా టివీ సీరియల్ తో పాటు టాలీవుడ్ లో పలు తెలుగు చిత్రాలు నిర్మించి,వందలాది చిత్రాలకు ఫైనాన్స్ చేసిన ప్రొడ్యూసర్ కమ్ ఫైనాన్సియర్ సోమా విజయ ప్రకాష్ - సోమా జ్యోతి ల తనయుడు సోమా వినీత్ వివాహం అమెరికా వాస్తవ్యులు మిస్టర్& మిస్సెస్ అలన్ ఏ.రస్సెల్ కుమార్తె కైత్లిన్ తో ఈ రోజు జరగనుంది.
వాస్తవానికి వీరి వివాహాన్ని గత మే 22న హైదరాబాద్ లో అత్యంత వైభవంగా నిర్వహించడానికి సన్నాహాలు చేశారు నిర్మాత సోమా విజయ ప్రకాష్.కానీ కరోనా అవరోధం కారణంగా అది సాధ్యపడపోవటంతో ఈ రోజు కేవలం పది పన్నెండు మంది స్థానిక అతిథుల సమక్షంలో జరుగుతున్న వివాహాన్ని హైదరాబాద్ నుండి లైవ్ లో చూస్తూ సరిపెట్టుకుంటున్నారు సోమా విజయ ప్రకాష్ దంపతులు.
అయితే యూ ట్యూబ్ లైవ్ ద్వారా తమ కుమారుడి వివాహాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న బంధుమిత్రులు అందరూ చూడగలగడం ఆనందంగా ఉంది అంటున్నారు సోమా విజయ ప్రకాష్. కాగా కరోనా కష్టకాలంలో జరుగుతున్న ఈ ఖండాంతర ప్రేమ వివాహం పట్ల మీడియా ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిస్తూ లైవ్ టేలిక్యాస్ట్ కు సన్నాహాలు చేయటం విశేషం.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు