కువైట్:గుండెపోటు తో ఏ.పి వాసి మృతి
- July 18, 2020
కువైట్ సిటీ:వైఎస్సార్ జిల్లా పెనగలూరు మండలం చక్రంపేట గ్రామానికి చెందిన లింగాల ఈశ్వర్ రెడ్డి (48) గత 15 సంవత్సరాలు గా కువైట్ లో టైలర్ గా కువైటీ ఇంట్లో పని చేసుకుంటున్నారు. ఈ నెల 13 వ తేదీ సాయంత్రం తీవ్ర గుండెపోటు రావడం వలన మృతి చెందారు.ఇతనికి భార్య,ఒక కుమారుడు ఉన్నారు. భార్య, కొడుకు కువైట్ లోనే వుండి దాదపు రెండు సంవత్సరాల క్రితమే ఇండియాకు పోయారు.లింగాల ఈశ్వర్ రెడ్డి మృతిచెందిన విషయాన్ని వైయస్ఆర్సిపి కువైట్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు ద్వారా ముమ్మడి బాలిరెడ్డి దృష్టికి తీసుకోని రాగా ఆయన వెంటనే స్పందించి ,కువైట్ లోని భారత రాయబార కార్యాలయం ద్వారా ఇమిగ్రేషన్ పనులన్నీ పూర్తి చేయించినారు. బాడీ బాక్స్ మరియు టికెట్ ఖర్చులు మృతుని బందువులు సమకూర్చారు.చెన్నై నుండి స్వస్ధలం చక్రంపేట వరకు అంబులెన్స్ ఉచితంగా ఏపిఎన్ఆర్టీఎస్ వారు, ఏర్పాటు చేశారు.
ఈ సందర్భముగా ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ కమిటీ సభ్యుల అభ్యర్ధన మేరకు ఉచితంగా అంబులెన్స్ ఏర్పాటు చేసినందుకు మేడపాటి వెంకట్(APNRTS ఛైర్మన్),బి.హెచ్ ఇలియాస్(APNRTS డైరెక్టర్) కి, వైయస్సార్సీపి కువైట్ కమిటీ తరపున కృతజ్ఞతలు తెలిపుతూ ఈశ్వర్ రెడ్డి కుటుంబానికి ప్రఘాడ సానుభూతి తెలియజేశారు. మృతదేహం ఖతార్ ఎయిర్వేస్ విమానం ద్వారా కువైట్ నుండి ఈ రోజు ఉదయం చెన్నై విమానాశ్రయం చేరుకొని అక్కడ నండి చక్రంపేట కు పంపిస్తారు .
--దివాకర్(మాగల్ఫ్ ప్రతినిధి,కువైట్)
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?