షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు..8 మంది అరెస్ట్

- July 19, 2020 , by Maagulf
షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతున్న ముఠా గుట్టురట్టు..8 మంది అరెస్ట్

షార్జా:నకిలీ బంగారు నాణేలు అమ్ముతూ మోసాలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎనిమిది మంది సభ్యులు ఉన్న ఈ ముఠా కొన్నాళ్లుగా మోసాలకు పాల్పడుతోంది. అమాయకులను టార్గెట్ గా చేసుకొని..వారిని బురిడి కొట్టిస్తారు. ముందుగా బంగారు నాణేలు చూపించి డీల్ కుదుర్చుకుంటారు. డబ్బు చేతిలో పడగానే నకిలీ బంగారు నాణేలు ఉన్న బ్యాగులను ఇచ్చి అక్కడి నుంచి క్షణాల్లో పరారవుతారు. ఇలాగే మోసపోయిన ఇద్దరు ప్రవాసీయులు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వ్యవహారం బయటపడింది. బాధితుల ఫిర్యాదుతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీలు చేపట్టగా..ఓ అసియా వ్యక్తి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతని నుంచి రెండు బ్యాగుల నిండా నకిలీ బంగారు నాణేలు ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన అసియా వ్యక్తి ద్వారా మిగిలిన ముఠా సభ్యుల సమాచారం కూడా పోలీసులు తెలుసుకున్నారు. దీంతో అందర్ని అరెస్ట్ చేసిన పోలీసులు తదుపరి న్యాయవిచారణకు కేసును బదిలీ చేశారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com