మస్కట్:రెంట్,లీజ్ అగ్రిమెంట్ తప్పనిసరిగా చేయించాలని మున్సిపాలిటీ అధికారుల హెచ్చరిక

- July 19, 2020 , by Maagulf
మస్కట్:రెంట్,లీజ్ అగ్రిమెంట్ తప్పనిసరిగా చేయించాలని మున్సిపాలిటీ అధికారుల హెచ్చరిక

మస్కట్ మున్సిపాలిటి పరిధిలోని భవన యజమానులు అందరూ తమ భవనాలను కిరాయి,లీజ్ ఇచ్చేందుకు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని మున్సిపాలిటి అధికారులు హెచ్చరించారు. భవనాలను కిరాయి ఇచ్చినా, ఇతరులకు లీజ్ కు ఇచ్చినా ఆ మొత్తంలో 5 శాతాన్ని మున్సిపాలిటికి అడ్మినిస్ట్రేటీవ్ ఫీ కింద చెల్లించాల్సి ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో నగరంలో చాలా మంది భవన యజమానాలు అడ్మినిస్ట్రేటీవ్ ఫీని తప్పించుకునేందుకు ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండానే అద్దెకు ఇస్తున్నారు. మరికొందరు వాస్తవ అద్దె మొత్తానికి బదులు చాలా తక్కువగా  అద్దెను చూపిస్తూ మున్సిపాలిటీ ఆదాయానికి గండికొడుతున్నారు. తమ తనిఖీలో ఇలాంటి ఉల్లంఘనలు పెద్ద సంఖ్యలో గుర్తించామని, ఇది మున్సిపాలిటీ ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపుతుందని అధికారులు చెబుతున్నారు. కిరాయిదారులు కూడా తాము అద్దెకు తీసుకునే ముందు కిరాయి ఒప్పందానికి సంబంధించి మున్సిపాలిటీలో రిజిస్టర్ చేసుకునేలా యజమానాలకు సూచించాలని కోరింది. తద్వారా భవిష్యత్తులో అద్దెకు సంబంధించి నిబంధనలను పక్కగా అమలు చేసేందుకు ఆస్కారం ఉంటుందని వివరించింది. ముఖ్యంగా ప్రవాసీయుల నివాసానికి సంబంధించి రెంట్ అగ్రిమెంట్ల రిజిస్ట్రేషన్ల ఉల్లంఘనలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామని మున్సిపాలిటి అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com