అలెర్ట్..అలెర్ట్..'కమ్యూనిటీ స్ప్రెడ్' దశలో భారత్: ఐఎంఏ
- July 19, 2020
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా అంతకంతకూ విజృంభిస్తోంది. ప్రతిరోజూ 34 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో కరోనా బాధితుల సంఖ్య 10 లక్షలు 38 వేల 715 దాటింది. భారతదేశంలో కరోనా కమ్యూనిటీ వ్యాప్తి ప్రారంభమైందని, పరిస్థితి మరింత దిగజారిందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తెలిపింది. ఐఎంఏ హాస్పిటల్ బోర్డ్ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ డాక్టర్ వి కె మోంగా మాట్లాడుతూ దేశంలో కరోనా వైరస్ రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని తెలిపారు. భారతదేశంలో ప్రతిరోజూ 30 వేలకు పైగా కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్ మోంగా పేర్కొన్నారు. ప్రస్తుతం కరోనా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యాప్తి చెందుతున్నదని అన్నారు. దీన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా సన్నద్ధమవ్వాలని అన్నారు. కాగా అమెరికా, బ్రెజిల్ తరువాత కరోనా రోగులు అధికసంఖ్యలో భారతదేశంలోనే ఉన్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?