అయోధ్య రామాలయ నిర్మాణ భూమిపూజ.. హాజరు కానున్న మోడీ
- July 19, 2020
న్యూఢిల్లీ: రామమందిర నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నారు. ఆగస్టు 5న అయోధ్యలో జరగనున్న ఈ కార్యక్రమానికి ప్రధాని హాజరుకానున్నారు. శ్రీరాముని ఆలయ భూమి పూజకు సంబంధించిన కార్యక్రమాలు వచ్చేనెల 5న ఉదయం 5 గంటలకు ప్రారంభమవుతాయి. దీంతో ఆగస్టు 5న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1.10 గంటల వరకు ప్రధాని మోదీ అయోధ్యలో ఉంటారని సమాచారం. ప్రధాని ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకర్గం కూడా కావడంతో రామమందిర భూమిపూజ వేడుకలో పాల్గొననున్నారు. కాశీకి చెందిన పూజారులతోపాటు వారణాసికి చెందిన కొందరు పూజారుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది.
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆగస్టులోనే భూమిపూజ నిర్వహించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు శనివారం సాయంత్రం జరిగిన సమావేశంలో ట్రస్టు తీర్మానించింది. ప్రధాని మోదీ మందిర నిర్మాణానికి భూమి పూజ చేస్తారని ప్రకటించింది. భూమిపూజ చేసిన రోజే నిర్మాణ పనులను ప్రారంభించనున్నామని ట్రస్టు అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు