కువైట్: 91 ఏళ్ల పాలకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స..ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన

- July 19, 2020 , by Maagulf
కువైట్: 91 ఏళ్ల పాలకుడికి విజయవంతంగా శస్త్రచికిత్స..ఆరోగ్యం నిలకడగా ఉందని ప్రకటన

కువైట్: కువైట్ యొక్క 91 ఏళ్ల పాలకుడు ఎమిర్ 'షేక్ సబా అల్ అహ్మద్ అల్ సబా' ను వైద్యపరీక్షలకై శనివారం ఆసుపత్రిలో చేర్పించిన అనంతరం ఆదివారం ఉదయం శస్త్రచికిత్స నిర్వహించారనీ అది వియవంతంగా ముగిసిందని ఎమిర్ కార్యాలయం తెలిపింది. కానీ, ఎలాంటి శస్త్రచికిత్స చేయించుకున్నారో పేర్కొనలేదు. దీంతో పాలకుడు ఆరోగ్యంపై సర్వత్రా ఆందోళన నెలకొంది.

శస్త్రచికిత్స తదుపరి విశ్రాంతి తీసుకుంటున్న ఎమిర్ స్థానంలో నియమించబడిన వారసుడు క్రౌన్ ప్రిన్స్ షేక్ నవాఫ్ అల్ అహ్మద్ అల్ సబా శనివారం రాజ్యాంగ విధులను తాత్కాలికంగా చేపట్టారు.

గత ఏడాది, ఆగస్టులో కువైట్‌లో అధికారిక పర్యటనలో ఉండగా ఎమిర్ ఆరోగ్య సమస్యలు ఎదుర్కోగా చికిత్సకై అమెరికాలో ఆసుపత్రిలో చేర్చారు అని ఆయన కార్యాలయం తెలిపింది. చికిత్స ముగించుకొని అక్టోబర్‌లో గల్ఫ్ అరబ్ రాష్ట్రానికి ఎమిర్ తిరిగి వచ్చారు.

కువైట్ ఎమిర్ త్వరగా కోలుకోవాలని శుభాకాంక్షలు తెలిపిన ప్రపంచ నేతలు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com