బహ్రెయిన్:అర్హత లేకుండానే బోటాక్స్, కాస్మోటిక్ ట్రీట్మెంట్..డాక్టర్లపై చర్యలు
- July 19, 2020
మనామా:సరైన అనుమతులు లేకుండానే కాస్మోటిక్ ట్రీట్మెంట్ అందిస్తున్న పలు ఆస్పత్రులు, డాక్టర్లపై బహ్రెయిన్ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఎలాంటి అర్హతలు లేకుండా బోటాక్స్(తేజోవంతంగా కనిపించేందుకు చేసే ట్రీట్మెంట్), డెర్మల్ ఫిల్లర్స్ చేస్తున్నట్లు జాతీయ ఆరోగ్య నియంత్రణ అధికార విభాగం వెల్లడించింది. అక్రమంగా బోటాక్స్ నిర్వహిస్తున్న డాక్టర్లను న్యాయవిచారణ ఎదుర్కొవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. అలాగే సరైన అనుమతులు లేకుండా కాస్మోటిక్ ట్రీట్మెంట్ అందిస్తున్న ఐదు ఆస్పత్రులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. బహ్రెయిన్ లో ఎవరైనా సరైన అనుమతులు లేకుండా, అర్హత లేకుండా ప్రజలకు ట్రీట్మెంట్ అందిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మెడికల్ విభాగానికి సంబంధించి సేవలు అందించాలనుకునే వారు..సంబంధిత విభాగాల నుండి లిఖిత పూర్వక అనుమతులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. అనుమతుల కోసం ఆయా డాక్టర్లు వారు చేసిన కోర్సు సర్టిఫికెట్లను [email protected] మెయిల్ చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అర్హత లేని డాక్టర్లను గుర్తించేందుకు ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు. https://www.nhra.bh/Departments/HCP/?page=68 లింక్ ద్వారా ఎవరెవరికి లైసెన్స్ ఉన్నాయో తెల్సుకోవచ్చని NHRA అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!







