దోహాలో ఆత్మహత్య చేసుకున్న ఏ.పి మహిళ
- July 19, 2020
దోహా:వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు తెలిపిన వివరాల ప్రకారం, తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం సంకరగుప్తం గ్రామానికి చెందిన తాడి విజయలక్షి(43) గత 2 నెలల క్రితం ఖతార్ లో ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది.తాడి విజయలక్షి మృతి చెందిన విషయం తెలుసుకున్న ఖత్తర్ లోని బిషప్ ఓగూరి బుల్లబ్బాయి గారు APNRTS కో-ఆర్డినేటర్ మరియు వైఎస్ఆర్సీపీ గల్ఫ్ ప్రతినిధి మండా వర్జిల్ బాబు తెలుపగా,ఖతార్ లోని భారత రాయబార కార్యాలయ అధికారులు ధీరజ్,ICBF మెంబెర్ రజనీ మూర్తి తో మాట్లాడి ఎమిగ్రేషన్ మరియు పేపర్ వర్క్ పనులు పూర్తి చేయించినారు.బాడి బాక్సు విమాన టికెట్ ఖర్చులు రాయబార కార్యాలయం వారు సమకూర్చారు. నిన్న ఖతార్ ఎయిర్ వేస్ విమానం ద్వారా, మృతదేహం హైదరాబాద్ కు పంపండం జరిగింది. ఖతార్ లోని భారత రాయబార కార్యాలయం వారికి మండా వర్జీల్ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
అలాగే హైదరాబాదు విమానాశ్రయం నుంచి మృతురాలి స్వస్థలం తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలం సంకరగుప్తం గ్రామానికి APNRTS వారి సహకారంతో, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించినారు.బిషప్ ఓగూరి బుల్లబ్బాయి ఆధ్వర్యంలో విల్సన్ బాబు, నాగేశ్వర్రావు, వెంకట్ తదితరులు ప్రార్ధన చేసి నివాళులు అర్పించారు.
మండా, వర్జిల్ బాబు మాట్లాడుతూ, ఉచిత ఏంబులెన్స్ సౌకర్యం కల్పించిన మేడపాటి వెంకట్( APNRTS ఛైర్మన్) , బి.హెచ్ ఇలియాస్(డైరెక్టర్)కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోజు మృతదేహం స్వస్థలం చేరింది.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!