అనుమతుల్లేని హజ్ యాత్రీకుల్ని తరలిస్తే జైలు, జరీమానా
- July 20, 2020
జెడ్డా: సౌదీ అరేబియా, అనుమతుల్లేకుండా హజ్ యాత్రికులని తరలిస్తే జైలు శిక్ష అలాగే జరీమానాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. సాధారణ పరిస్థితుల్లో 2 మిలియన్ మంది హజ్ యాత్ర చేస్తుంటారు. అయితే, కరోనా వైరస్ నేపథ్యంలో ఈ సంఖ్యను చాలా తక్కువకు పరిమితం చేశారు. ఈ నేపథ్యంలో అక్రమ మార్గంలో వచ్చేవారి సంఖ్య పెరిగే అవకాశం వుంటుంది గనుక, అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే కఠినమైన చర్యలు తీసుకోనున్నట్లు సౌదీ ప్రభుత్వం వెల్లడించింది. వలసదారులెవరైనా ఉల్లంఘనలకు పాల్పడితే, కొంతకాలం పాటు వారికి సౌదీలోకి ప్రవేశం లేకుండా నిషేధిస్తారు. అక్రమంగా యాత్రీకుల్ని తరలిస్తే 15 రోజుల జైలు శిక్షతోపాటు 10,000 సౌదీ రియాల్స్ జరీమానా విధించడం జరుగుతుంది. అత్యధికంగా 50,000 జరీమానాతోపాటు, వాహనాన్ని స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అలాగే ఒక్కో యాత్రీకుడికి 6 నెలల జైలు శిక్ష కూడా విధిస్తారు.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!