మరో 4 భారతీయ నగరాలకు..ఎమిరేట్స్ ఎయిర్లైన్స్
- July 20, 2020
దుబాయ్:దుబాయ్ కి చెందిన ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ సంస్థ కీలక ప్రకటన చేసింది. జూలై 26 వరకు మరో నాలుగు భారతీయ నగరాలకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడపనున్నట్లు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. ఇరు దేశాల మధ్య ఈ నెల 12 నుంచి 26 వరకు ప్రత్యేక రిపాట్రియేషన్ విమానాలను నడిపేందుకు భారత్, యూఏఈ పౌరవిమానయాన శాఖల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బెంగళూరు, ఢిల్లీ, కొచ్చి, ముంబై, తిరువనంతపురం ప్రాంతాలకు విమానలను నడపనున్నట్లు ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్ మొదట ప్రకటించింది. తాజాతా అహమ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు కూడా తమ సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. కాగా.. ‘వందే భారత్ మిషన్’నాలుగో విడుతలో భాగంగా ఈ విమానాలు యూఏఈలో చిక్కుకుపోయిన భారత ప్రవాసులను ఇండియాకు తరలిస్తున్నాయి. అదే విధంగా ఇండియాలో చిక్కుకున్న యూఏఈ నివాసితులు, ఎన్నారైలను యూఏఈకి తరలిస్తాయి.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?