తెలంగాణలో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు
- July 20, 2020
హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,198 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 46,274 చేరింది. వైరస్ బాధితుల్లో కొత్తగా 7 మరణాలు సంభవించడంతో మొత్తం మరణాల సంఖ్య 422 కు చేరింది. తాజాగా 1885 మంది కరోనా రోగులు కోలుకోవడంతో మొత్తం సంఖ్య 34,323 కు చేరింది. కోవిడ్ బాధితుల రికవరీ రేటు 74 శాతంగా ఉండటం శుభ పరిణామం. రాష్ట్రంలో ప్రస్తుతం 11,530 యాక్టివ్ కేసులున్నాయి. సోమవారం నమోదైన కేసుల్లో GHMC పరిధిలో 510 కేసులు, రంగారెడ్డి 106, కరీంనగర్ 87, మేడ్చల్ 76, వరంగల్ అర్బన్ 73, మహబూబ్ నగర్ జిల్లాల్లో 50 కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
--హరి(మాగల్ఫ్ ప్రతినిధి,తెలంగాణ)

తాజా వార్తలు
- గ్రేస్ పీరియడ్‌ను మరో 6 నెలలు పొడిగించిన సౌదీ అరేబియా..!!
- కువైట్ లో పేమెంట్ లింక్ పై బ్యాంకుల పర్యవేక్షణ కఠినతరం..!!
- అల్ బిడ్డా పార్కులో లాంతర్న్ పేస్టివల్..!!
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!







