చీటింగ్‌ ఫిర్యాదులపై కంపెనీపై ప్రశ్నలు

- July 21, 2020 , by Maagulf
చీటింగ్‌ ఫిర్యాదులపై కంపెనీపై ప్రశ్నలు

బహ్రెయిన్: ఉమ్ అల్‌ హసామ్ ప్రాంతంలోని ఓ కంపెనీపై చీటింగ్‌ ఆరోపణలు నేపథ్యంలో అథారిటీస్ పై‌ ప్రశ్నలు కురిపించడం జరిగింది. జాబ్‌ ప్లేస్‌మెంట్స్‌ ఆఫర్‌ చేసే ఆ కంపెనీపై ఓ ప్రముఖ సోషల్‌ వర్కర్‌ స్పందిస్తూ, నేపాల్‌, బంగ్లాదేశ్‌, ఉగాండా అలాగే ఆఫ్రికాలోని మరికొన్ని ప్రాంతాలకు చెందిన వలసదారుల్ని సదరు కంపెనీ ఉద్యోగాలు కల్పిస్తామని మోసం చేస్తున్నట్లు అభియోగాలు వచ్చినట్లు చెప్పారు. ఆ సోషల్‌ వర్కర్‌, ఎంపీ అమ్మార్‌ అల్‌ బన్నాయ్‌కి ఈ విషయమై ఫిర్యాదు చేయడం జరిగింది. ఎంపీ ఈ కేసు విషయాన్ని సంబంధిత అథారిటీస్‌ దృష్టికి తీసుకెళ్ళారు. కరోనా వైరస్‌ టెస్టింగ్‌ కోసం ఉద్యోగార్థుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు సంస్థపై అభియోగాలు మోపబడ్డాయి. ఈ నేపథ్యంలో సంస్థపై అథారిటీస్‌ ఆకస్మిక తనిఖీలు నిర్వహించడం జరిగింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయాలని సోషల్‌ వర్కర్‌ సూచించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com