బిగ్ బాస్ 4 లోగో వచ్చేసింది..

- July 21, 2020 , by Maagulf
బిగ్ బాస్ 4 లోగో వచ్చేసింది..

బిగ్‌బాస్ ఒకప్పుడు ఉత్తరాదికి మాత్రమే పరిమితమైన ఈ షో క్రమ క్రమంగా దక్షిణాదికి పాకింది. ఇక్కడి వారిని మెల్ల మెల్లగా తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. సెలబ్రిటీలని కంటెస్టెంట్‌లుగా తీసుకుంటూ వరుసగా ఆసక్తికరమైన ఎపిసోడ్‌లతో ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడం మొదలుపెట్టింది. బిగ్‌బాస్ ఇప్పటికి మూడు సీజన్‌లని పూర్తి చేసుకుంది. తాజాగా సీజన్ 4 లోకి ఎంటరవుతోంది.

సీజన్ 3 ఎంతగా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. శ్రీముఖి, రాహుల్ సిప్లిగంజ్‌ల కారణంగా ఈ షోకి పాపులారిటీ పెరిగింది. దీంతో సీజన్ 4కు భారీ క్రేజ్ ఏర్పడింది. దానికి తగ్గట్టే మేకర్స్ కంటెస్టెంట్‌లని ఎంపిక చేసుకుంటున్నారంటూ జోరుగా ప్రచారం మొదలైంది. కరోనా వైరస్ విజంభిస్తున్న వేళ బిగ్‌బాస్ సీజన్ 4ని మరింత హీటెక్కించాలని మేకర్స్ హాట్ హీరోయిన్‌లని ఎంపిక చేసుకుంటున్నారని వార్తలు జోరందుకున్నాయి.

ఇదిలా వుంటే బిగ్‌బాస్ సీజన్ 4 ప్రోమో రానే వచ్చేసింది. గత మూడు సీజన్‌లకు మించి లోగో, ప్రోమోలోనే భారీ మార్పులు చేసినట్టు కనిపిస్తున్నాయి. అంటే ఈ సీజన్ మరింత కొత్తగా వుండబోతుందని ప్రోమోతో చెప్పారన్నమాట. ఇందులో శ్రద్దా దాస్‌, యామినీ భాస్కర్‌, హంసా నందిని, తరుణ్‌, ప్రియా వడ్లమాని, మంగ్లీ, బిత్తిరి సత్తిలను కంటెస్టెంట్‌లుగా ఎంపిక చేశారని ప్రచారం జరుగుతోంది. అయితే ప్రోమోలో దీనిపై మేకర్స్ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ షో త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com