ఎన్-95 మాస్కులు వాడొద్దు.. భారత్ హెచ్చరిక
- July 21, 2020
కరోనా రాకుండా ఏ మాస్కులు వాడాలన్నదానిపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. చాలామంది ఖరీదైన ఎన్-95 మాస్కులు వైరస్ను సమర్థంగా అడ్డుకుంటాయని భావిస్తున్నారు. వాల్వ్ ఉండడం వల్ల గాలి కూడా బాగా అందుతుందని ప్రచారంలో ఉంది. అయితే అవి కరోనానకు అడ్డుకోలేవని, వాటిని వాడొద్దని కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖలోని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ అన్ని రాష్ట్రాలకు లేఖ రాశారు. చాలా మంది కవాటం ఉనన ఎన్-95 మాస్కులు అవగాహన లేకుండా వాడుతున్నారని అందులో పేర్కొన్నారు. వాటికి బదులు సాధారణ మాస్కులను, ఇంట్లో చేసుకున్న మాస్కులు వాడాలని కోరారు. ఎన్-95 మాస్కులను ఆరోగ్య సిబ్బంది, భవన నిర్మాణ కార్మికులు ఎక్కువగా వాడుతుంటారు. అవి బయటి నుంచి వచ్చే గాలిని ఫిల్టర్ చేస్తాయి. అయితే దాన్ని ధరించిన వ్యక్తి నోటి నుంచి వచ్చే గాలిని అవి ఫిల్టర్ చేయలేవని శాస్త్రవేత్తలు. మాస్కులను ఎంత సమయం వాడాలన్నదానిపైనా ప్రజల్లో అపోహలు ఉన్నాయి. 8 నుంచి 16 గంటలు వాడాలని కొందరు చెబుతుంటే వారం వరకు వాడొచ్చని మరికొందరు అంటున్నారు. ఒక రోజు వాడి పారేస్తే మంచిదని వైద్యులు చెబుతున్నారు. వీటిని ఎండబెట్టి, శానిటైజ్ చేసుకుని వాడొచ్చని మరికొందరు అంటున్నారు. ఈ నేపథ్యంలో వాటి జోలికి పోవొద్దని కేంద్రం హెచ్చరించింది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?