గాలి ద్వారా కరోనా వ్యాప్తి : సిఎస్ఐఆర్ కీలక సూచనలు
- July 21, 2020
కరోనా వైరస్ ప్రపంచంలో రోజు రోజుకు పెరిగిపోతున్నది. కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. చాలా దేశాల్లో కరోనా తీవ్రత తగ్గినట్టే తగ్గి తిరిగి పెరుగుతున్నది. కరోనా వైరస్ రూపాంతరం చెందటం వలనే కేసులు పెరుగుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కరోనా వైరస్ గాలిలో వ్యాపించే విధంగా రూపాంతరం చెందినట్టు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. 239 మంది శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థకు దీనిపై లేఖలు రాసిన సంగతి తెలిసిందే.
గాలి ద్వారా కరోనా వ్యాప్తి చెందుతుండటంతో సిఎస్ఐఆర్ కొన్ని సూచనలు చేసింది. కేవలం బయటకు వెళ్ళినపుడే కాకుండా ఆఫీస్ లో ఉండే సమయంలో కూడా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచించింది. తక్కువ స్పేస్ లో ఎక్కువ మంది ఉండకుండా చూసుకోవాలని, కార్యాలయాల్లో వెలుతురు ఉండేలా చూసుకోవాలని సూచించింది. సాధ్యమైనంత వరకు రద్దీ ఉండే ప్రాంతాల్లోకి వెళ్లోద్దని సూచించింది సిఎస్ఐఆర్.
తాజా వార్తలు
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!







