కోవిడ్-19 తో మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు ఎయిర్ ఇండియా సాయం..
- July 21, 2020
కోవిడ్ బారిన పడి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు నిర్ణీత మొత్తంలో పరిహారం అందిస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది. సంస్థలో చాలా మంది ఉద్యోగులు కరోనా బారిన పడి మరణించారని జూలై 20 నాటి సర్క్యులర్ లో ఎయిర్ ఇండియా పేర్కొంది. కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయిన శాశ్వత ఉద్యోగుల కుటుంబాలు, చట్టపరమైన వారసుడికి 10 లక్షల రూపాయలు, ఫిక్స్ డ్ టెర్మ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు 5 లక్షలు, ఏడాది పాటు నిరంతరం పనిచేసిన ఉద్యోగులకు రూ.90 వేలు అందజేస్తామని సంస్థ వివరించింది. ఒకవేళ ఉద్యోగి కాంట్రాక్టర్ ద్వారా కానీ, సర్వీస్ ప్రొవైడర్ ద్వారా కానీ నియమితులై ఉంటే రెండు నెలల స్థూల వేతనాన్ని ఇస్తామని తెలిపింది. ఈ చెల్లింపులు ఏప్రిల్ 1 2020 నుంచి మార్చి 2021 వరకు అమలులో ఉంటుందని పేర్కొంది.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?