దుబాయ్: 'మసాలా కింగ్' ఔదార్యం..ఇండియన్ వర్కర్లకు ఉచితంగా విమాన టికెట్లు
- July 22, 2020
దుబాయ్: కరోనా సంక్షోభంతో దేశంకాని దేశంలో అవస్థలు పడుతున్న ప్రవాస భారతీయులకు చేదోడుగా నిలుస్తున్నారు అల్ ఆదిల్ ట్రేడింగ్ చైర్మన్ డాక్టర్ ధనంజయ్ దాతర్. కరోనా ప్రభావంతో ఉద్యోగాలు కొల్పోయి ఇండియాకు రాలేక కష్టాలు పడుతున్న దాదాపు 186 మందికి రెండు ఛార్టెర్డ్ ఫ్లైట్లు ఏర్పాటు చేసి ఉచితంగా టికెట్లు అందించారు. ఎమిరేట్స్ చార్టెర్డ్ ఫ్లైట్ ద్వారా 98 మంది కార్మికులను పూణేకి..ఫ్లైదుబాయ్ చార్టెర్డ్ ఫ్లైట్ ద్వారా 88 మందిని ముంబైకి తరలించినట్లు ధనంజయ్ వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన ధనంజయ్ యూఏఈలో సుగంధ ద్రవ్యాల వ్యాపారంలో స్థిరపడి మసాలా కింగ్ గా పేరు తెచ్చుకున్నారు. కరోనా సమయంలో సాటి భారతీయులు కష్టాలు పడుతుండటంతో ఆయన తనవంతు సాయంగా ఉచితంగా టికెట్లు అందించి ప్రవాస భారతీయులను ఇండియాకు తరలించారు. వివిధ సంస్థల సాయంతో ఇప్పటివరకు దాదాపు పన్నెండు వందల మందికి ఉచితంగా టికెట్లు ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటికే రెండు ఛార్టెర్డ్ ఫ్లైట్స్ కార్మికులను తరలించిన ధనంజయ్, ఈ సారి తన సొంత రాష్ట్రానికి ఛార్టెర్డ్ ఫ్లైట్ ఏర్పాటు చేస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన చాలా మంది ఉద్యోగాలు కొల్పోయి ఒత్తిడిలో ఉన్నారని అన్నారాయన. ఉద్యోగాలు కొల్పోయిన వారితో పాటు Dh 2,000 కంటే తక్కువ జీతం ఉన్నవారికి ప్రధాన్యం ఇచ్చి వారిని సొంత రాష్ట్రానికి తరలించేందుకు కసరత్తు చేస్తున్నాట్లు వివరించారు. అంతేకాదు..కొంతమంది కార్మికుల పాస్ట్ పోర్టులు ఇంకా వారి కంపెనీ యజమానుల దగ్గరే ఉన్నాయని, అలాంటి కార్మికులను ఇండియా తరలించేందుకు ఆయా కంపెనీల యాజమాన్యాలతో మాట్లాడి పాస్ పోర్ట్ లను తిరిగి ఇప్పిస్తున్నామని ధనంజయ్ తెలిపారు. ఇండియన్ కార్మికులను తరలించటంలో దుబాయ్ లోని భారత దౌత్య కార్యాలయం నుంచి అందుతున్న సాయం మరిచిపోలేనిదని ఆయన కొనియాడారు.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు