ఫుడ్‌ అలాగే మందులు అవసరమైన మేర సమకూర్చుకోవాలి

- July 22, 2020 , by Maagulf
ఫుడ్‌ అలాగే మందులు అవసరమైన మేర సమకూర్చుకోవాలి

మస్కట్:ఒమన్‌ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ (ఓసిసిఐ), ఫుడ్‌ అలాగే కన్స్యూమర్ గూడ్స్ మరియు మెడికల్‌ సప్లయ్స్‌ సెక్టార్లు తగిన మేర నిల్వలు వుంచుకోవాలని సూచించింది. లాక్‌డౌన్‌ అలాగే ఈద్‌ సెలవుల నేపథ్యంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించడం జరిగింది. సుల్తానేట్‌లోని అన్ని గవర్నరేట్స్‌లో నిల్వలు వుంచుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ అయ్యాయి. గవర్నరేట్ల మధ్య టోటల్‌ లాక్‌డౌన్‌ అమలు కానున్న నేపథ్యంలో ఈ చర్యలకు ఆదేశించారు. అయితే, అవసరానికి మించి వినియోగదారులు కొనుగోళ్ళు జరపరాదని కూడా సూచించడం జరిగింది. సుప్రీం కమిటీ - కోవిడ్‌ 19, జులై 25 నుంచి ఆగస్ట్‌ 8 వరకు టోటల్‌ లాక్‌డౌన్‌ అన్ని గవర్నరేట్స్‌లోనూ అమలవుతుందని ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com