ఇంకా ఖరారు కాని అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ తేదీ

- July 22, 2020 , by Maagulf
ఇంకా ఖరారు కాని అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణ తేదీ

జెడ్డా:సౌదీ అరేబియా జనరల్‌ అథారిటీ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (జిఎసిఎ) వెల్లడించిన వివరాల ప్రకారం, అంతర్జాతీయ విమానాల పునరుద్ధరణకు సంబంధించి ఇంకా ఎలాంటి తేదీ ప్రకటితం కాలేదని తెలుస్తోంది. ఈ మేరకు జనరల్‌ సివిల్‌ ఏవియేషన్‌ అథారిటీ ట్విట్టర్‌ ద్వారా ఓ ప్రకటన చేసింది. సంబంధిత అథారిటీస్‌ ఈ విషయమై నిర్ణయం తీసుకుంటాయని పేర్కొంది. నిర్ణయం తీసుకున్నాక ఆ విషయాన్ని వెల్లడిస్తామని పేర్కొంది. మార్చి నెలలో అంతర్జాతీయ విమాన సర్వీసుల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, డొమెస్టిక్‌ విమానాలు మాత్రం జూన్‌ నుంచి పునరుద్ధరింపబడ్డాయి.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com