తెలంగాణ వాసికి అండగా నిలిచిన దుబాయ్ ఎల్లాల శ్రీనన్నసేవాసమితి
- July 24, 2020
యూ.ఏ.ఈ:దుబాయ్ ఎల్లాల శ్రీనన్నసేవాసమితి ముఖ్య కార్యదర్శి చిలుముల రమేష్ అందించిన వివరాల ప్రకారం, దుబాయ్ లో సర్వం కోల్పోయి తిండి లేక,ఇబ్బందులు పడుతూ, ట్రక్కుల మధ్యలో పడుకుంటూ, ఎవరైనా ఏదయినా ఇస్తే కడుపునింపుకుని, ఏం చేయాలో, ఎటు వెళ్ళాలో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా, సారంగాపూర్ మండలం, చించోలి గ్రామానికి చెందిన అంధకూర్ లింగయ్య పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న దుబాయ్ ఎల్లాల శ్రీనన్న సేవాసమితి అల్ కుశైస్ సమన్వయకర్త గణేష్ మరియు సామాజికవేత్త జైతా నారాయణ లింగయ్య దగ్గరకు వెళ్లి పరిస్థితి తెలుసుకుని రవి బొల్లారపు అనే వ్యక్తితో మాట్లాడి లింగయ్య ఉండటానికి వసతి సమకూర్చడం జరిగింది. పాస్పోర్ట్ లేకపోవడంతో ఇంటికి వెళ్ళటానికి కావలసిన డాకుమెంట్స్ ఇండియన్ కౌన్సలేట్ సహాయంతో సమకూర్చగా, అలాగే టిక్కెట్టు కొనే పరిస్థితిలో లేని లింగయ్య వివరాలు ఇండియన్ కౌన్సలేట్ దృష్టికి వాలంటీర్ ద్వారా తీసుకువెళ్లటంతో కౌన్సలేట్ ఉచిత టికెట్ అందించి లింగయ్య ను ఈరోజు ఇంటికి పంపించడం జరిగింది.
లింగయ్యను గత 6 నెలలుగా తన రూమ్ లో ఉంచుకుని, ఆహారం అందించిన రవి బొల్లారపు కు మరియు అతను ఇంటికి వెళ్ళటానికి ఆర్థిక సహాయం చేసిన అధ్యక్షులు రవి ఉట్నూరి,గణేష్ పింజారకు, మరియు ముఖ్యంగా పేపర్ వర్క్ కొరకు లింగయ్యకు అవుట్ పాస్పోర్ట్ ఏర్పాటు చేసి ఈరోజు విమానాశ్రయంలో విడిచిపెట్టిన జైతా నారాయణ(సోషల్ వర్కర్)కి ధన్యవాదాలు తెలిపిన లింగయ్య.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?