హైదరాబాద్‌లో ఇ-సిమ్ కార్డ్ మార్పిడి మోసాలు...

- July 24, 2020 , by Maagulf
హైదరాబాద్‌లో ఇ-సిమ్ కార్డ్ మార్పిడి మోసాలు...

హైదరాబాద్:సైబ‌ర్ నేర‌గాళ్లు ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త త‌ర‌హాలో మోసాల‌కు పాల్ప‌డుతూనే ఉంటారు.. తాజాగా హైద‌రాబాద్‌లో సిమ్ కార్డు అప్‌డేట్ పేరుతో మోసానికి పాల్ప‌డుతోన్న వ్య‌వ‌హారం వెలుగుచూసింది.. ఈ- సిమ్ కార్డ్ పేరుతో సైబర్ నేరగాళ్ల కొత్తగా మోసాలు చేస్తున్నారు.. సిమ్ కార్డ్ అప్ డేట్ అంటూ ఫోన్ చేస్తారు.. సిమ్ కార్డు బ్లాక్ అవుతుంద‌ని న‌మ్మ‌బ‌లికి ట్రాప్ చేస్తారు.. రిజిస్ట్రేషన్, ఈ మెయిల్, అప్ డేట్ అంటూ మాయ‌మాట‌లు చెప్పి ముగ్గులోకి దింపుతారు.. అన్ని వివ‌రాలు రాబ‌ట్టి.. మీ బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును కాజేస్తారు.

తాజాగా, హైద‌రాబాద్ సైబ‌ర్ క్రైమ్ పోలీసుల‌కు మూడు ఫిర్యాదులు అందాయి.. మొత్తంగా ముగ్గురు బాధితుల నుంచి రూ.16 లక్షలకు పైగా నొక్కేశారు కేటుగాళ్లు.. మియాపూర్‌కు చెందిన అప్పలనాయుడు అనే వ్యక్తి వద్ద నుండి రూ. 9.20 లక్షలు, గచ్చిబౌలి కి చెందిన కుమార్ కుషల్ అనే వ్యక్తి నుంచి రూ. 5.94 ల‌క్ష‌లు, అదే ప్రాంతానికి చెందిన సురేష్ రమణ అనే వ్యక్తి నుండి రూ.1.04 ల‌క్ష‌లు కాజేశారు. ఇలాంటి మోసాలపై ఈ మ‌ధ్య‌ ఫిర్యాదులు వరుసగా వస్తున్నాయని.. అపరిచితులకు వివరాలు చెప్పొద్ద‌ని హెచ్చ‌రిస్తున్నారు సైబ‌ర్ క్రైమ్ పోలీసులు. ముఖ్యంగా ఎయిర్‌టెల్ నెట్‌వ‌ర్క్ వినియోగ‌దారుల‌నే సైబ‌ర్ నేర‌గాళ్లు టార్గెట్ చేసిన‌ట్టుగా చెబుతున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com