క్యాన్సిలేషన్, రిఫండ్కి సంబంధించి ప్రయాణీకులకు పూర్తి హక్కులు
- July 24, 2020
కువైట్ సిటీ:మార్చి 14 నుంచి జులై 31 వరకు క్యాన్సిలేషన్ లేదా రిఫండ్కి సంబంధించి ప్రయాణీకులకు పూర్తి హక్కులున్నాయని డైరెక్టర్ జనరల్ ఫర్ సివిల్ ఏవియేషన్ స్పష్టం చేయడం జరిగింది. ఈ మేరకు ఓ సర్క్యులర్ని కూడా జారీ చేశారు. కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేత కారణంగా నష్టపోయిన ప్రయాణీకులకు క్యాన్సిలేషన్ లేదా రిఫండ్ చేసుకోవడానికి పూర్తి హక్కులు ఈ సర్క్యులర్ కల్పిస్తుంది. మార్చి 14 నుంచి 31 జులై వరకు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కరోనా లాక్డౌన్ నేపథ్యంలో మూసివేసిన విషయం విదితమే. ట్రావెల్ టికెట్స్, హోటల్ రిజర్వేషన్లు అలాగే టూరిస్టు సర్వీసులకు ఇది వర్తిస్తుంది. రిజర్వేషన్ల కండిషన్ల నుంచి పూర్తిస్థాయిలో మినహాయింపులు ఈ సమయానికి వర్తిస్తాయి.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!