భారత్:దేశీయ విమానాలపై నవంబర్ 24 వరకు ఆంక్షలు కొనసాగింపు
- July 24, 2020
న్యూ ఢిల్లీ:భారత్ లో కరోనావైరస్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ శుక్రవారం దేశీయ విమానాలపై ఆంక్షలను నవంబర్ 24 వరకు పొడిగించింది. ఈ సాయంత్రం విడుదల చేసిన నోటిఫికేషన్ లో కూడా దేశీయ విమాన ఛార్జీలపై గతంలో విధించిన నియంత్రణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. వ్యాధి వ్యాప్తిని నివారించడానికి ప్రభుత్వం భారత దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి 25 న దేశీయ విమానాలను నిలిపివేశారు. కేంద్ర విమానయాన మంత్రి హర్దీప్ పూరి ఈ నెల ప్రారంభంలో మాట్లాడుతూ దీపావళి నాటికి ప్రయాణించే దేశీయ విమానాల సంఖ్య 55 నుండి 60 శాతానికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. దేశీయ విమానయాన పరిశ్రమ వివిధ రంగాలకు ఛార్జీల పరిమితితో, పరిమిత సామర్థ్యంతో పనిచేస్తున్నందున ఆర్థిక నష్టాలను ఎదుర్కొంటోంది.
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్ స్ట్రీట్ రీ ఒపెన్..!!
- బహ్రెయిన్-సెర్బియా మధ్య ఆర్థిక సహకారం బలోపేతం..!!
- ఆసుపత్రిలో చేరిన వారిలో 96% మంది వ్యాక్సిన్ తీసుకోలేదు..!!
- సోహార్ ఇంటర్నేషనల్ బెలూన్ ఫెస్టివల్.. పర్యాటకానికి బూస్ట్..!!
- సాద్ అల్-అబ్దుల్లాలో తల్లిని చంపిన వ్యక్తి..!!
- యూఏఈ ఎతిహాద్ ఫ్లైట్స్ చెక్-ఇన్ ఆలస్యం..!!
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!