దుబాయ్:30 మంది కార్మికులు ఫైన్లు కట్టలేదని విమానాశ్రయంలో నిలిపివేత

- July 24, 2020 , by Maagulf
దుబాయ్:30 మంది కార్మికులు ఫైన్లు కట్టలేదని విమానాశ్రయంలో నిలిపివేత

దుబాయ్:దుబాయ్ లో జరిమానా చెల్లించలేదనే కారణంతో 30 మంది భారతీయుల ప్రయాణాన్ని యూఏఈ ప్రభుత్వం అడ్డుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌కు చెందిన దాదాపు 40 మంది భవన నిర్మాణ కార్మికులు.. యూఏఈలోని ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో పని చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో కార్మికులను స్వదేశానికి పంపడానికి ఆ సంస్థ జూలై 17న ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేసింది. ఆ 40 మంది కార్మికులు కూడా ప్రయాణానికి సిద్ధమయ్యారు. తీరా వాళ్లు విమానం ఎక్కే ముందు.. గడువు ముగిసిన వీసాలతో యూఏఈలో ఉన్నందుకు, ఫైన్ క్లియర్ చేయని కారణంగా దాదాపు 30 మంది కార్మికుల ప్రయాణాన్ని యూఏఈ ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో ఆ ముప్పై మంది  కార్మికులు.. దాదాపు నాలుగు రోజుల పాటు విమానాశ్రయంలోనే గడిపారు. ఈ క్రమంలో దుబాయ్ లోని ఇండియన్ కాన్సులేట్ కార్యాలయం అధికారులు జోక్యం చేసుకున్నారు.నీరజ్ అగర్వాల్(ఇండియన్ కాన్సులేట్--ప్రెస్, ఇన్ఫర్మేషన్ అండ్ కల్చర్ కాన్సుల్)మాట్లాడుతూ సదరు సంస్థ ఏర్పాటు చేసిన వసతి గృహాలకు కార్మికులను అల్ కూజ్ వర్కర్స్ క్యాంపుకు తరలించారు. ఈ క్రమంలో స్పందించిన కార్మికులు.. గడువు ముగిసిన వీసాతో యూఏఈలో ఉంటున్నందుకు ప్రభుత్వం తమకు లక్షల్లో జరిమానా విధించిందని వాపోయారు. యూఏఈ ప్రభుత్వం తమకు జరిమానా విధించిన విషయం కూడా విమానాశ్రయం‌కు వెళ్లే వరకు తమకు తెలియదని పేర్కొన్నారు. అయితే యూఏఈ ప్రభుత్వం తమకు విధించిన జరిమానాను కట్టకుండానే.. తమను తరలించేందుకు తమ యజమాని ప్రయత్నాలు చేస్తున్నారని కార్మికులు వెల్లడించారు. ఇందులో భాగంగా.. ఈ నెల 27న మరో విమానాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు. కాగా.. దీనిపై సదరు సంస్థ ప్రతినిధి మాట్లాడారు. కార్మికులు జరిమానా చల్లించకుండా..స్వదేశానికి తరలించేందుకు పేపర్ వర్క్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.యూఏఈ ప్రభుత్వం కూడా ఫైన్లు మాఫీ చేసి వారి ప్రయాణానికి అనుమతి ఇస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com