అధికంగా వాడితే ఇక్కట్లు తప్పవట!
- July 25, 2020
కరోనా వైరస్ వ్యాప్తితో చేతుల పరిశుభ్రతకు ప్రాధాన్యం పెరిగింది. ఎక్కడికి వెళ్లినా శానిటైజర్ రాసుకోవడం సబ్బు నీళ్లతో కడగటం ఎక్కువైంది. చివరికి వంట చేసే సమయంలో కూడా శానిటైజర్ రాసుకుంటున్నారు. అయితే శానిటైజర్‌తో ఎంత ప్రయోజనం వుందో.. అంతే నష్టం కూడా ఉందంటున్నారు నిపుణులు.
ఎప్పుడూ సబ్బు నీటితో చేతులు కడుక్కోవడం కాబట్టి చాలా మంది శానిటైజర్లనే ఉపయోగిస్తున్నారు. వీటిలో ఆల్కహాల్‌తో తయారు చేసిన శానిటైజర్ల వినియోగం ఎక్కువగా వుంది. అయితే వీటిని అధికంగా వాడటం వల్ల చేతిపై వుండే చర్మం దుష్ప్రభావాలకు గురవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తీవ్రమైన పొడిబారడం, మంట, చర్మం ఎర్రబడటం వంటి చర్మ సమస్యలను ఇప్పటికే ప్రజలు ఎదుర్కొంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాస్తవానికి మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కొన్ని రకాల మంచి బ్యాక్టీరియాలు దోహదం చేస్తాయి. అందువల్ల శానిటైజర్‌ను అవసరం మేరకే వాడాలి కానీ అదే పనిగా వాడకూడదు. వీటిని ఎక్కువగా వాడితే వైరస్, క్రిములు తమ రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మన శరీరానికి, చేతులకు సహజ సిద్ధంగా ఉండే రోగ నిరోధక శక్తి స్థాయి తగ్గుతుందంటున్నారు. కొందరు తుమ్మినా దగ్గినా శానిటైజర్ ఉపయోగిస్తున్నారు. ఇది మంచిది కాదట.. చేతులు అపరిశుభ్రంగా, దుమ్ము, మట్టి అంటుకున్నప్పుడు వాడటం బెటర్ అని వైద్యులు తెలిపారు.
ఇంట్లో ఉన్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవడం మేలని.. సుమారు 20 సెకన్ల పాటు చేతుల్ని శుభ్రంగా కడుక్కోవడం వల్ల క్రిముల బారినపడకుండా ఉంటామని నిపుణులు సూచిస్తున్నారు. హ్యాండ్ శానిటైజర్లను వాడటం వల్ల చేతి చర్మంపై ఏమైనా మార్పులు కనిపిస్తుంటే శానిటైజర్ వాడటం మానేయడం మంచిది.
హీలింగ్ లేపనాలతో ఉన్న మాయిశ్చరైజర్‌లను ఉపయోగించడం వల్ల చేతి చర్మం తిరిగి పూర్వ స్థితికి చేరే అవకాశాలు ఉంటాయి. చర్మంపై పగుళ్లు వచ్చినట్లయితే వీటిని తగ్గించేందుకు గాను రాత్రిపూట గ్లౌజులు ధరించి, ఆక్వాపోరిన్ కలిగిన మాయిశ్చరైజర్లను వాటిపై రాసుకోవచ్చంటూ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?