10,000 ఆహారపు పొట్లాలను పంపిణీ చేసిన ముహరాక్‌ పోలీస్‌

- July 25, 2020 , by Maagulf
10,000 ఆహారపు పొట్లాలను పంపిణీ చేసిన ముహరాక్‌ పోలీస్‌

బహ్రెయిన్: ముహరాక్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌, 10,000 ఆహారపు పొట్లాలను పంపిణీ చేస్తున్నట్లు పేర్కొంది. ఫీనా ఖాయిర్‌ నేషనల్‌ క్యాంపెయిన్‌లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టారు. హ్యుమానిటేరియన్‌ వర్క్‌ అండ్‌ యూత్‌ ఎఫైర్స్‌కి సంబంధించి కింగ్‌ ప్రతినిది, నేషనల్‌ సెక్యూరిటీ అడ్వయిజర్‌ అలాగే రాయల్‌ హ్యుమానిటేరియన్‌ ఫౌండేషన్‌ బోర్డ్‌ ట్రస్టీస్‌ ఛైర్మన్‌ అయిన షేక్‌ నాజర్‌ బిన్‌ హమాద్‌ అల్‌ ఖలీఫా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముహరాక్‌ గవర్నరేట్‌ పోలీస్‌ డైరెక్టరేట్‌ డైరెక్టర్‌ బ్రిగేడియర్‌ సలెహ్‌ రషీద్‌ అల్‌ దోస్సారి మాట్లాడుతూ, ఆహారపు పొట్లాలను అవసరమైన పేదలకు అలాగే వలస కార్మికులకు అందిస్తున్నట్లు చెప్పారు. ఛారిటీస్‌, వాలంటీర్ల సాయంతో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు వివరించారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com