షూటింగ్ చేసే పరిస్థితులు లేవు సినిమాల చిత్రీకరణకు కరోనా వైరస్ ఇబ్బంది ఉంది...
- July 25, 2020
పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్' సినిమాతోపాటు క్రిష్ దర్శకత్వంలోని మరో చిత్రం సెట్స్ మీద ఉన్నాయి. జనసేన పార్టీ కార్యక్రమాలను నడుపుతూనే మరో వైపు ఆ సినిమాల చిత్రీకరణల్లో పాల్గొంటూ వచ్చారు. . కరోనా మహమ్మారి తీసుకొచ్చిన ఆరోగ్య విపత్తుతో చిత్రసీమ స్తంభించిపోయింది. సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. పవన్ కల్యాణ్ సినిమాలు మళ్ళీ ఎప్పుడు మొదలవుతాయనే చర్చ అటు ఆయన అభిమానుల్లోనూ... ఇటు చిత్ర వర్గాల్లోనూ ఉంది. జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
ప్రశ్న: మీ కొత్త సినిమా ప్రాజెక్టుల గురించి ఏమైనా చెబుతారా?
- కరోనా వల్ల అన్నీ ఆగిపోయాయి. అవి ఎప్పుడు మొదలవుతాయో తెలియదు. సామాజిక దూరం పాటించాలి. తొందరపడి షూటింగులు చేసుకున్నా కష్టమే. ఆ మధ్యన కొంత మంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని, కేసీఆర్ ని కలిశారు. అనుమతులు ఇచ్చినప్పటికీ షూటింగ్ చేసే పరిస్థితులు లేవు. ఎవరికైనా కరోనా సోకితే.. ఉదాహరణకు మొన్న అమితాబచ్చన్ కి వచ్చింది. ముఖ్య నటులకు వచ్చినా.. ఎవరికి వచ్చినా.. ఇబ్బందే. వ్యాక్సిన్ వచ్చే వరకు ఒక నిస్సహాయతతో అంతా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?