స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ‘జోహార్’ పోస్టర్ విడుదల చేసిన ప్రొడ్యూసర్ అల్లు అరవింద్
- July 25, 2020
అతి తక్కువ కాలంలోనే తెలుగు ప్రేక్షకులకు నచ్చిన, మెచ్చే కంటెంట్‌ను అందిస్తున్న తెలుగు ఓటీటీ మాధ్యమంగా ’ఆహా’ పేరు తెచ్చుకుంది. ఇప్పటికే ‘భానుమతి అండ్ రామకృష్ణ, కృష్ణ అండ్ హిజ్ లీల’ వంటి డిఫరెంట్ బ్లాక్‌బస్టర్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులను అందించింది ‘ఆహా’. ఇప్పుడు ప్రేక్షకులను మరింత ఎంటర్టైన్ చేయడానికి సిద్ధమైంది. అందులో భాగంగా ఆగస్టులో నెలలో పొలిటికల్ డ్రామా ‘జోహార్’ స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగస్ట్ 14న ‘ఆహా’లో విడుదలవుతుంది. ఈ చిత్రం ద్వారా తేజ మార్ని దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. భాను సందీప్ ఈ చిత్ర నిర్మాత. ‘జోహార్’ చిత్రంతో పాటు మరికొన్ని ఎగ్జైటింగ్ రిలీజ్లు ఆగస్ట్ నెలలో తెలుగు ‘ఆహా’ ఓటీటీలో సందడి చేయనున్నాయి.
శనివారం ‘జోహార్’ పోస్టర్‌ను ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు తేజ మార్ని, నిర్మాత భాను సందీప్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా...
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మాట్లాడుతూ - ‘‘‘జోహార్’ సినిమా పోస్టర్‌ను విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఈ చిత్రం ద్వారా ఇంకా కొత్త టాలెంట్‌ను తెలుగు చిత్రసీమకు పరిచయం చేయడం హ్యపీగా ఉంది. భావోద్వేగాల మేళవింపుతో తెరకెక్కిన పొలిటికల్ డ్రామాగా ‘జోహార్’ చిత్రం రూపొందింది. ఎంగేజింగ్ విజువల్స్‌తో అందరినీ సినిమా మెప్పిస్తుంది.
అంకిత్ కొయ్య, ఈస్తర్ అనిల్, శుభలేఖ సుధాకర్, నైనా గంగూలీ, ఈశ్వరీ రావు, రోహిత్ తదితరులు తారాగణంగా నటిస్తున్నారు.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్‌లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?