కరోనా నుంచి కోలుకుంటున్న యూఏఈ...

- July 26, 2020 , by Maagulf
కరోనా నుంచి కోలుకుంటున్న యూఏఈ...

యూఏఈ: యూఏఈ క్ర‌మంగా మ‌హ‌మ్మారి క‌రోనా నుంచి కోలుకుంటోంది. గ‌త కొన్ని రోజులుగా పాజిటివ్ కేసులు త‌గ్గ‌డంతో పాటు రిక‌వ‌రీలు పెరుగుతున్నాయి.శ‌నివారం కూడా 313 కొత్త కేసులు న‌మోదు కాగా... 393 రిక‌వ‌రీలు న‌మోద‌య్యాయి. దీంతో దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టివ‌ర‌కు 58,562 మంది ఈ వైర‌స్ బారిన ప‌డితే... 51,628 మంది కోలుకుని ఆస్ప‌త్రి డిశ్చార్జి అయ్యార‌ని ఆ దేశ ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. కాగా, ఇప్ప‌టివ‌ర‌కు దేశ‌ వ్యాప్తంగా 343 మంది మరణించారు.మ‌రోవైపు క‌రోనా వ్యాప్తిని క‌ట్ట‌డి చేసేందుకు యూఏఈ ముమ్మ‌రంగా కోవిడ్ టెస్టులు నిర్వ‌హిస్తోంది. ఇప్ప‌టికే రికార్డుస్థాయిలో 4.5 మిలియ‌న్ల‌కు పైగా కోవిడ్ టెస్టులు పూర్తి చేసింది.

అలాగే ఆగ‌స్టు నెలాఖ‌రు వ‌ర‌కు 6 మిలియ‌న్ల క‌రోనా ప‌రీక్ష‌లు పూర్తి చేయాల‌ని యూఏఈ ఆరోగ్య‌శాఖ నిర్ణ‌యించుకుంది. అందుకే ప్ర‌తిరోజూ దేశ‌వ్యాప్తంగా వేల సంఖ్య‌లో కోవిడ్ టెస్టులు చేప‌డుతోంది.అంతేగాక వ్యాక్సిన్ ట్ర‌య‌ల్స్‌లోనూ మూడో ద‌శ‌కు చేరుకున్న‌ట్లు ఆ దేశ‌ ఆరోగ్య‌శాఖ తెలిపింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com