శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ హీరోయిన్ గా కొత్త సినిమా ప్రారంభం
- July 27, 2020
శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై ఆదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్ మరియు అజయ్ ముఖ్య తారాగణం తో విప్రా దర్శకత్వం లో గౌరీ కృష్ణ నిర్మాతగా గౌరు ఘానా సమర్పణలో నిర్మించబడుతున్న నూతన చిత్రం ఇటీవలే హైదరాబాద్ లో ఘనం గా ప్రారంభమైంది. పూజ కార్యక్రమం అనంతరం....
నిర్మాత గౌరీ కృష్ణ మాట్లాడుతూ "శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం పై చిత్రం ప్రారంభం అవ్వటం చాలా సంతోషం గా ఉంది. ఈ కరోనా టైం లో ఇలాంటి విపత్తు సమయం లో మేము సినిమా ప్రారంభించటం చాలా అదృష్టం గా భావిస్తున్నాము. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకులని పరిచయం చేయటం చాలా ఆనందం గా ఉంది. ఆదా శర్మ మా చిత్రం లో హీరోయిన్ గా ముఖ్య పాత్ర చేస్తుంది. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్ సినిమా , ఈరోజు నుంచే మా చిత్రం షూటింగ్ ప్రారంభం కానుంది. ఏకధాటి షెడ్యూల్ తో ఈ చిత్రాన్ని పూర్తిచేయాలని అనుకుంటున్నాం. కథ చాలా బాగుంది " అని తెలిపారు.
విప్రా దర్శకులు మాట్లాడుతూ "శ్రీ కృష్ణ క్రియేషన్స్ పతాకం గౌరీ కృష్ణ నిర్మాతగా మా చిత్రం ఈరోజు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. ఈరోజు నుంచి 10 రోజులు పటు హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుని తర్వాత నిర్మల్ లో రెండో షెడ్యూల్ ప్రారంభిస్తాం" అని తెలిపారు.
హీరోయిన్ ఆదా శర్మ మాట్లాడుతూ "నా గత చిత్రాలు హార్ట్ ఎటాక్, క్షణం నాకు మంచి పేరు తెచ్చాయి, ప్రేక్షకులు నానుంచి మంచి సినిమాలు కోరుకుంటున్నారు. ఇప్పుడు ఈ చిత్రం కూడా అలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తున్నా సినిమా. నాకు ఈ చిత్రం లో అవకాశం ఇచ్చిన నిర్మాత గౌరీ కృష్ణ మరియు దర్శకులు విప్రా గారికి ధన్యవాదాలు" అని తెలిపారు.
బ్యానర్ : శ్రీ కృష్ణ క్రియేషన్స్
నటి నటులు : ఆదా శర్మ, సంజయ్, భాను శ్రీ, అభయ్, హరి తేజ, అక్షిత శ్రీనివాస్, అజయ్, తదితరులు
కెమెరా : వంశీ ప్రకాష్
ఎడిటర్ : ఉద్ధవ్
ఆర్ట్ డైరెక్టర్ : ఉప్పెందర్ రెడ్డి
పి ఆర్ ఓ : కుమారా స్వామి
నిర్మాత : గౌరీ కృష్ణ
కథ, కథనం, దర్శకత్వం : విప్రా
తాజా వార్తలు
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!
- రోడ్డుపై బట్టలు ఆరేస్తే BD100 జరిమానా..!!
- యూఏఈ లాటరీ 'లక్కీ డే డ్రా'.. ముగ్గురికి చెరో Dh50,000 బహుమతి..!!
- అబుదాబిలో 'యమ్మీ ఇండియన్ బైట్' రెస్టారెంట్ మూసివేత..!!
- సూమ్ యాప్లో ఖైదీల తయారీ ఉత్పత్తుల విక్రయం..!!
- అలిపిరి నడక మార్గంలో భక్తుల భద్రతకు మరింత పటిష్ట చర్యలు: వెంకయ్య చౌదరి
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై యూఏఈ ఆందోళన..తక్షణమే యుద్ధ విరమణ, చర్చలు పునఃప్రారంభించాలని పిలుపు
- విజయవాడ విమానాశ్రయ అభివృద్ధి పనుల పై సమీక్ష.. కేంద్ర మంత్రి రామ్ మోహన్ నాయుడుతో ఎంపీల సమావేశం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభం..సీఎం చంద్రబాబు ప్రకటన
- డబ్బులు తీసుకుని వీసాలు ఇప్పిస్తామంటూ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలని దుబాయ్ పోలీసుల హెచ్చరిక







