SBIలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ...
- July 27, 2020
న్యూ ఢిల్లీ:నిరుద్యోగులకు, బ్యాంకు ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారికి SBI గుడ్ న్యూస్ తెలిపింది. బ్యాంకింగ్ పరీక్షలు రాయడానికి ప్రిపేర్ అవుతున్న వారి కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3850 ఖాళీల భర్తీకి గాను సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ పోస్టుల నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈ ఉద్యోగాల్లో గుజరాత్, తెలంగాణ సర్కిల్‌కు 550 ఖాళీలను ప్రకటించింది. మొత్తం 3850 పోస్టుల భర్తీకి తెలంగాణతో పాటు గుజరాత్, కర్నాటక, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, తమిళనాడు, రాజస్తాన్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులను కోరుతుంది. 2020 జూలై 27 రోజు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. చివరి తేది 2020 ఆగస్ట్ 16 వరకు ఉంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.sbi.co.in/web/careers/వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్‌కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







