‘శ్రీ‌కారం’లో ఏకాంబ‌రంగా సాయికుమార్.. లుక్ విడుదల

- July 27, 2020 , by Maagulf
‘శ్రీ‌కారం’లో ఏకాంబ‌రంగా సాయికుమార్.. లుక్ విడుదల

యంగ్ హీరో శ‌ర్వానంద్ న‌టిస్తోన్న లేటెస్ట్ ఫిల్మ్ ‘శ్రీ‌కారం’ షూటింగ్ చివ‌రిద‌శ‌లో ఉంది. కిశోర్ బి. డైరెక్ట్ చేస్తోన్న ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌లో హీరోయిన్‌గా ప్రియాంకా అరుళ్ మోహ‌న్ న‌టిస్తున్నారు. సోమ‌వారం (జూలై 27) డైలాగ్ కింగ్ సాయికుమార్ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా, ఈ సినిమాలో ఆయ‌న లుక్‌తో కూడిన పోస్ట‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. సాయికుమార్ ఈ చిత్రంలో ఏకాంబ‌రం అనే కీల‌క పాత్ర చేస్తున్నారు. స‌న్న‌ని మీస‌క‌ట్టుతో యంగ్ లుక్‌లో ఆయ‌న‌ క‌నిపిస్తున్నారు. ఇప్పటికే శ‌ర్వానంద్ బ‌ర్త్‌డేకి రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌, స్పెష‌ల్ టీజ‌ర్‌కు మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com