'కనబడుటలేదు' ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన వెంకటేష్ మహా, సత్యదేవ్
- July 27, 2020
బాలరాజు రచన చేస్తూ దర్శకత్వం వహిస్తోన్న సస్పెన్స్ అండ్ లవ్ థ్రిల్లర్ 'కనబడుటలేదు'. ఈ ఫిల్మ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సోమవారం ఉదయం 09:09 గంటలకు 'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' చిత్ర దర్శకుడు వెంకటేష్ మహా, హీరో సత్యదేవ్ ఆవిష్కరించారు.
ఫస్ట్ లుక్ పోస్టర్లో కథానాయకుడు సుక్రాంత్ వీరెళ్ల ఒక తాడుకు వేలాడగట్టిన కొన్ని ఫొటోల వంక సీరియస్‌గా చూస్తుండటం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.
త్వరలో టీజర్‌ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
యుగ్ రామ్, శశిత కోన, నీలిమ పెతకంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ రాజు, ఉమామహేశ్వర రావు, కిశోర్, శ్యామ్, మధు కీలక పాత్రధారులైన ఈ చిత్రాన్ని ఎస్.ఎస్. ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్నారు. సరయు తలశిల సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు.
మధు పొన్నాస్ మ్యూజిక్ సమకూరుస్తున్న ఈ చిత్రానికి సందీప్ బద్దుల సినిమాటోగ్రాఫర్‌గా, రవితేజ కుర్మాన ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.
తారాగణం:
సుక్రాంత్ వీరెళ్ల, యుగ్ రామ్, శశిత కోన, నీలిమ పతకంశెట్టి, సౌమ్య శెట్టి, 'కేరాఫ్ కంచరపాలెం' ఫేమ్ రాజు, ఉమామహేశ్వర రావు, కిశోర్, శ్యామ్, మధు
సాంకేతిక బృందం:
సంగీతం: మధు పొన్నాస్
సినిమాటోగ్రఫీ: సందీప్ బద్దుల
ఎడిటింగ్: రవితేజ కుర్మాన
సమర్పణ: సరయు తలశిల
రచన-దర్శకత్వం: బాలరాజు
బ్యానర్స్: ఎస్.ఎస్. ఫిలిమ్స్, శ్రీపాద క్రియేషన్స్, షేడ్ స్టూడియోస్
తాజా వార్తలు
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్‌లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!
- ఇంటర్వ్యూల్లో AI ప్రాంప్ట్ మోసం–కంపెనీలు తీసుకున్న కొత్త నిర్ణయం!
- కువైట్‌లో బాధ్యతలు స్వీకరించిన పరమిత త్రిపాఠి..!!
- ఖతార్ లో ఫోర్డ్ కుగా 2019-2024 మోడల్స్ రీకాల్..!!
- సౌదీ అరేబియాలో 25% పెరిగిన సైనిక వ్యయం..!!







