ఇండియాకి కువైట్ ఎయిర్ వేస్ షెడ్యూల్ విడుదల
- July 28, 2020
కువైట్ సిటీ:కువైట్ ఎయిర్‌వేస్, మరో ఏడు అంతర్జాతీయ గమ్యస్థానాలకు సంబంధించి బుకింగులను ప్రకటించింది. వీటిల్లో ఇండియా కూడా ఒకటి. ముంబై, ఢిల్లీ, కోచి మరియు చెన్నయ్‌లక ఆగస్ట్ నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాహోర్, మ్యునిచ్, బాకు, అమ్మాన్, సరాజెవో మరియు కతార్‌లకు కూడా బుకింగులు ప్రారంభమయ్యాయి. కొద్ది రోజుల క్రిత దుబాయ్, లండన్, జనెనీవా, బీరట్, కైరో, బహ్రెయిన్, టర్కీలకు రిజర్వేషన్లను ప్రారంభించిన విషయం విదితమే. కువైట్ ప్రభుత్వ సూచనతో ఆగస్ట్ 1 నుంచి ఎంపిక చేసిన గమ్యస్థానాలకు మాత్రమే విమానాలు నడపుతున్నట్లు కువైట్ ఎయిర్ వేస్ స్పష్టం చేసింది. కరోనా వైరస్ నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణాలకు ఇబ్బందులు ఏర్పడిన విషయం విదితమే. రోజుకి 10,000 మంది ప్రయాణీకులకు మించకుండా 100 విమాన సర్వీసులకు మించకుండా కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం తన సేవల్ని అందించనుంది.
తాజా వార్తలు
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష
- H1B visa: భయంతో స్వదేశ ప్రయాణాలు రద్దు చేసుకుంటున్న భారతీయులు