ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూత

- July 28, 2020 , by Maagulf
ప్ర‌ముఖ ర‌చ‌యిత, న‌టుడు రావి కొండ‌ల రావు క‌న్నుమూత

ప్రముఖ , సినీ జర్నలిస్టు, నటుడు, రచయిత, దర్శకుడు రావి కొండలరావు ఇకలేరు. కొద్దికాలంగా వృద్దాప్య సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న ఆయన మంగళవారం గుండెపోటుతో మరణించారు. ఆయన మృతితో తెలుగు, తమిళ సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. ఆయన మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. రావి కొండలరావు మరణంతో సినీ పరిశ్రమ గొప్ప నటుడిని, రచయితను కోల్పోయింది అంటూ తమ సంతాప ప్రకటనలో పేర్కొంటున్నారు.

1932, ఫిబ్రవరి 11 న శ్రీకాకుళం లో జన్మించిన రావి కొండలరావు, ఆరు దశాబ్దాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో 600లకు పైగా సినిమాలలో తన విలక్షణ నటనతో ప్రేక్షకులను అలరించారు... ప్రముఖ నటి రాధాకుమారి రావి కొండలరావు సతీమణి, 2012 లో ఆవిడ మృతి చెందారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com