అయోధ్యలో ఉగ్ర కుట్రలకు పాక్ పన్నాగం!
- July 29, 2020
అయోధ్యలో ఉగ్రవాద దాడి చేయాలని పాక్ పన్నాగం రచించింది. పాకిస్తాన్ గూడచారి సంస్థ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) ఆగస్టు 15 న అయోధ్యలో విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేసినట్టు భారత ఇంటెలిజెన్స్ అధికారులు పసిగట్టారు.. ఈ దాడి చేయడానికి ఆఫ్ఘనిస్తాన్లోని లష్కర్ యే తోయిబా , జైష్ మహమ్మద్ ఉగ్రవాదులకు ఐఎస్ఐ శిక్షణ ఇస్తున్నట్లు ఇంటెలిజెన్స్ రిపోర్టులు వచ్చాయి.
మూడు నుంచి ఐదు టెర్రరిస్టు గ్రూపులు భారత్ లోకి చొరబడేందుకు చూస్తున్నాయని, ఇందుకు పాక్ ఐఎస్ఐ వారికి సాయం చేస్తోందని తెలిపారు. 20 నుంచి 25 మంది నియంత్రణ రేఖ వెంట, 5 నుంచి 6 మంది ఇండో నేపాల్ సరిహద్దుల గుండా భారత్ లోకి చొరబడే అవకాశాలు ఉన్నాయని ఇంటెలిజెన్స్ అధికారులు పేర్కొన్నారు. కాగా ఆగస్టు 5 న ప్రధాని మోదీ భవ్య రామ మందిర నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- తెలంగాణ: 'ఆర్థిక ఇబ్బందులున్నా వడ్డీ లేని రుణాలు'
- రైల్వే ప్రయాణికులకు బిగ్ రిలీఫ్..
- ఖతార్ సాయం..ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇద్దరు బ్రిటిషర్స్ విడుదల..!!
- UN టూ-స్టేట్ సొల్యూషన్ కాన్ఫరెన్స్ లో సౌదీ క్రౌన్ ప్రిన్స్..!!
- వ్యాక్సినేషన్ సమయంలో పొరబాటు.. డాక్టర్ కు Dh350,000 ఫైన్..!!
- కువైట్లో అంతర్జాతీయ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ నెట్వర్క్ బస్ట్..!!
- ఉత్తర అల్ షర్కియాలో గాయపడ్డ వ్యక్తి..!!
- ఇక నిర్మాణ పనులకు సైలంట్ అవర్స్..!!
- ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం ఒక పవిత్రమైన సేవ
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?